Recurring Deposit: పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టపోయే అవకాశం ఉండదనే సంగతి తెలిసిందే. దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ పై ఆసక్తి చూపవచ్చు. సులభంగా లక్షాధికారి కావాలని అనుకునే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ పై ఆసక్తి చూపితే మంచిదని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల కోసం దీర్ఘ కాలం వేచి చూస్తే అదిరిపోయే రాబడి సొంతమయ్యే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి లభిస్తుంది. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ కు గరిష్ట పరిమితి లేదు. నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసే ఛాన్స్ ఉండగా ఇన్వెస్ట్ చేసే మొత్తంపై రాబడి ఆధారపడి ఉంటుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీ అమలవుతోంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది. నెలకు 10,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 16 లక్షల రూపాయలు లభిస్తాయి. పోస్టాఫీస్ లో ఈ స్కీమ్ తో పాటు ఇతర స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర స్కీమ్స్ లో కూడా అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంట్లో పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేర్చితే మంచిది.