Bigg Boss 5 Telugu: అనుకోకుండా ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యి అందరి అభిమానాన్ని మూటకట్టుకుంటుంది ప్రియాంకా సింగ్. ఇదిలా ఉండగా కామెడీ తో దూసుకెళ్తూ అందరిని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తుంది జబర్దస్త్. అలాంటి కామెడీ షో లేడీ గేటప్ లు వేసి తనదైన ముద్ర ప్రదర్శించాడు సాయి తేజ. ఆనతి కాలంలోనే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి అబ్బురపరిచాడు. అంతే కాకుండా తన పేరుని ప్రియాంకా సింగ్ గా మార్చుకున్నాడు.
ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా స్నేహితుల సహాయంతో లింగ మార్పిడి మార్పించుకుని ప్రియాంకా సింగ్ గా మారింది అని చెప్పుకొచ్చింది. కానీ, ప్రియాంక సింగ్ మాత్రం అబ్బాయి నుండి అమ్మాయిగా మారిందని వాళ్ళ నాన్నకి మాత్రం తెలియదు. అయితే బిగ్ బాస్ ప్రియాంక కి జన్మలో మర్చిపోలేని ఒక బహుమతిని కానుకగా ఇచ్చాడు.
ఈ మధ్య బిగ్ బాస్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ పుట్టిన రోజుని ఏదొక రూపంలో సెలబ్రేట్ చేస్తున్నాడు. అలా ప్రియాంక సింగ్ పుట్టిన రోజు సందర్భం గా బిగ్ బాస్ మర్చిపోలేని బహుమతిని పంపాడు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంగతి ఇప్పుడు ప్రియాంక సింగ్ వాళ్ళ నాన్న కి తెలిసిపోయింది. దానికి సంబందించిన వీడియో కూడా ప్రియాంక కి చూపిస్తాడు బిగ్ బాస్.
ఇప్పుడు నేను దైర్యం గా ఇంటికి వెళ్లొచ్చు.. అంతకు ముందు నేను వచ్చినట్టు పక్కింటి వాళ్ళకి కూడా తెలీదు అంటూ బోరున ఏడుస్తూ కంటతడి పెట్టుకుంది ప్రియాంక. అంతే కాకుండా ప్రియాంక వాళ్ళ ఇంటి నుండి వచ్చిన చీర సారె ని కూడా పంపించాడు బిగ్ బాస్. ఒక్కసారిగా ఈ సంఘట ని చూసి అందరూ భావోద్వాగానికి గురైనట్లు బిగ్ బాస్ తాజా గా విడుదల చేసిన ప్రోమో లో కనిపిస్తుంది.