Alia Bhatt : ఈమధ్య హీరోలకంటే హీరోయిన్స్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నారు. ఉదాహరణకి జాన్వీ కపూర్ ని తీసుకుందాం. బాలీవుడ్ లో ఈమె ఒక ఫ్లాప్ హీరోయిన్, కానీ టాలీవుడ్ కి వచ్చిన తర్వాత ‘దేవర’ చిత్రానికి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో, ఆమె తదుపరి రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకి ఏకంగా 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసింది. నిర్మాతలు అందుకు ఒప్పుకున్నారు కూడా. జాన్వీ కపూర్ సినిమా మొత్తానికి కలిపి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తే, అలియా భట్ 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా 9 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
అలియా భట్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కేవలం ఈమె పేరుని చూసి థియేటర్ కి కదిలే ఆడియన్స్ లక్షల సంఖ్యలో ఉంటుంది. అలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టే, టాలీవుడ్ లో ఇంత డిమాండ్ చేసింది. ఇంతకు ఆమె పది రోజులకు 9 కోట్ల రూపాయిల రెమ్యూనరేష తీసుకున్న సినిమా మరేదో కాదు, #RRR. ఈ చిత్రం లో ఆమె రామ్ చరణ్ కి జోడిగా నటించింది. సినిమాలో ఈమె కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ మంచి బలం ఉన్న పాత్రలోనే కనిపించింది. థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కచ్చితంగా గుర్తించుకోదగ్గ పాత్రలలో అలియా భట్ పాత్ర కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాకీ పార్ట్ కోసం ఆమె 6 రోజుల డేట్స్ ఇవ్వగా, ‘ఎత్తరా జెండా’ పాట కోసం మరో నాలుగు రోజుల డేట్స్ ఇచ్చింది. మొత్తం కలిపి పది రోజులకు గాను ఆమె ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకుంది.
అయితే అలియా భట్ మూవీ టీం నిర్వహించిన అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నది. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్స్ ప్రొమోషన్స్ చేయడం కోసం కూడా డబ్బులు తీసుకుంటారు. కానీ అలియా భట్ మాత్రం ప్రొమోషన్స్ కి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ ని కూడా తీసుకోలేదట. తనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ప్యాకేజ్ లోనే ఆమె ప్రొమోషన్స్ లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కోసం కూడా ఆమె బాలీవుడ్ లో ఉచితంగా ‘దేవర’ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి చేసింది. అయితే ఆమెకి ఉన్నటువంటి క్రేజ్ కి ఆ మాత్రం రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లో తప్పేమి లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇకపోతే రీసెంట్ గానే ఆమె ‘జిగ్రా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి అలియా భట్ నిర్మాతగా కూడా వ్యవహరించింది.