Actor Srihari: టాలీవుడ్ డైరెక్టర్ ఏ.ఎస్.రవికుమార్.. నందమూరి బాలకృష్ణతో ‘వీరభద్ర’ చిత్రం తీశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇందులో బాలకృష్ణకు జోడీగా తనూ శ్రీ దత్తా, సదా నటించారు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత చాలా కాలానికి ‘ఆటాడిస్తా’ అనే సినిమా తీసిన రవికుమార్..అప్పుడు కూడా సరైన రీతిలో సక్సెస్ అందుకోలేకపోయారు. కాగా, ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పిక్చర్ తీసి సక్సెస్ అందుకున్నారు. అయితే, ఈ చిత్రం తీయడానికి చాలా టైం పట్టిందని రవికుమార్ తెలిపారు.
ఈ చిత్రం స్టోరి ఒకే అనుకుని షూటింగ్ స్టార్ట్ చేసిన టైంలో శ్రీహరి అకాల మరణం జరిగిందని చెప్పాడు రవికుమార్. ఆ టైంలో ఏం చేయాలో తెలియక చాలా ఆలోచించానని, ఈ క్రమంలోనే జగపతిబాబును అడగగా, ఆయన సహృదయంతో పాత్ర పోషించడానికి ఒప్పుకున్నారని తెలిపాడు. అయితే, మూవీ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ విషయంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో తాను మళ్లీ స్టోరి చేంజ్ చేసుకుని రాసుకున్నానని, ఆ తర్వాత మళ్లీ దానిని షూట్ చేశానని, అలా చివరకు 2014లో చిత్రం విడుదలైందని చెప్పుకొచ్చాడు రవికుమార్.
Also Read: ఈ ఏడాది వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్న సినీ వారసులు వీళ్లే..
ఇకపోతే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను నిలబెట్టేందుకుగాను ఈ సినిమా ఉపయోగపడిందని సినీ పరిశీలకులు చెప్తుంటారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా రెజీనా కసాండ్రా నటించింది. ఇకపోతే ఈ చిత్రం నిజానికి సాయిధరమ్ తేజ్ రెండో చిత్రం. కానీ, విడుదల పరంగా ఇదే మొదలు రిలీజ్ అవడంతో అందరూ ఇదే సాయితేజ్ తొలిచిత్రం అనుకుంటారు. ఆయన నటించిన ‘రేయ్’ చిత్రం విడుదల పరంగా ఆలస్యం అయింది.
ఈ పిక్చర్ తర్వాత ఏ.ఎస్.రవికుమార్ మ్యాచ్ మ్యాన్ గోపీచంద్ తో ‘సౌఖ్యం’ సినిమా తీశాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బాగా ఆడింది. ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో కామెడీ చూసి జనాలు కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా రెజీనా కసాండ్రా నటించింది.