
మొబైల్ వాడొద్దన్నందుకు ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో మజుముల్, సుఫియా భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని రోజులుగా సుఫియా సెల్ ఫోన్ కు బాగా వాడుతుండేది. అయితే కొన్ని రోజులుగా మొబైల్ ఫోన్ వాడకంపై తరుచూ గొడవలు పడుతుండేవారు. అయితే తాజాగా సుఫియా తీవ్ర మసస్థాపానికి గురై ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఫ్యాన్కు ఉరి వేసుకుంది. దీంతో మైసూర్ జిల్లాలో విషాదం నెలకొంది.