
దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన దేశభక్తుల చరిత్రలతోపాటు దేశాభివృద్ధికి పాటుపడిన మహనీయుల జీవితాలను యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు జీవితంలోని కీలక ఘట్టాల సంకలనంగా పాత్రికేయుడు, కవి, రచయిత కృష్ణారావు రచించిన “విప్లవ తపస్వి-పీవీ” పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించి ప్రసంగించారు.