
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికపై తెలంగాణ.. సప్రీం కోర్టును ఆశ్రయించింది. అదనంగా ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా దర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. జీతాలు, ఇతర సమస్యలపై ఉద్యోగులు సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.