
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటారు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతిథ్య ఆస్ట్రేలియా 195 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా (4/56), రవించంద్రన్ అశ్విన్ (3/35), మహ్మద్ సిరాజ్ (2/40) చెలరేగి ఆసీస్‌ను కట్టడి చేశారు. మార్నస్ లుబుషేన్(48), ట్రవిస్ హెడ్(38) టాప్ స్కోర్లర్లుగా నిలిచారు.