
ప్రతిష్ఠాత్మక ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ పురస్కారానికి తనను ఎంపిక చేసి, అమెరికా తనను సమున్నతంగా గౌరవించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం భారత్, అమెరికా చేస్తున్న కృషికి గుర్తింపు ఈ పురస్కారమని పేర్కొన్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల ఇరు దేశాల్లోని రాజకీయ పార్టీల సమ్మతిని ఈ పురస్కారం ప్రతిబింబిస్తుందన్నారు.