
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. చర్చల కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల నుంచి తొలగించవలసిన, వాటికి చేర్చవలసిన అంశాలేమిటో ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. తమ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిందని, భవిష్యత్తులో మరికొన్నిటిని తీసుకొస్తుందని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ వివేక్ అగర్వాల్ ఆదివారం 40 రైతు సంఘాల నేతలకు లేఖలు రాశారు.