
భారత ఐటీ దిగ్గజం, టాటా కన్నల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకుడు ఫకీర్ చంద్ మృతి చెందారు. ఆయన ఆ సంస్థకు మొదటి సీఈవో కూడా. 100 బిలియన్ల డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి పునాది వేసిన కోహ్లిని సాఫ్ట్ వేర్ పితామహుడు అని పిలుస్తారు. 1991లో ఐబీఎం సంస్థను భారత్ కు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత్ లో ఐటీ టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కించారు. టాటా ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసిన ఫకీర్ చంద్ రిటైర్డ్ అయిన తరువాత వయోజన విద్య మీద ద్రుష్టి పెట్టారు. చదువుకోని పెద్దలకు అక్షరాస్యత నేర్పించడంలో తీవ్ర కృషి చేశారు. ఆయన భారత్ కు చేసిన సేవలకు ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం ఆయనకు 96 సంవత్సరాలు.