
జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8.33 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 3.7గా నమోదయ్యిందని తెలిపింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. లఢక్‌లో కూడా ఈనెల 3న భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయ్యిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.