
కరోనా వైరస్ బారిన నుంచి పూర్తిగా కోలుకోకముందే దేశంలో మరో వైరస్ విస్తరిస్తోంది. కరోనా వైరస్ మొదటిసారిగా కనుగొనబడిన కేరళలోనే ‘షిగెల్లా’అనే మరో వైరస్ బయటకు వచ్చింది. ఈ వైరస్ తో తాజాగా 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో 20 మంది ఈ వైరస్ తో బాధపడుతున్నారు. ఈ విషయన్ని స్వయంగా కోజికోడ్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ జయశ్రీ తెలిపారు. షిగెల్లా కలుషిత నీరు, ఆహారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. కాగా మరణించిన బాలుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యలు ప్రస్తుతం షిగెల్లాతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచనలు చేస్తోంది.