
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మొదటి టెస్ట్ ఘోర పరాజయానికి తోడు ప్రధాన పేసర్ మహమ్మద్ షమీ జట్టకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. దీంతో అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తరువాత షమీ మణికట్టుకు జరిపిన స్కానింగ్ లో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో షమీ మిగిలిన మూడు టెస్టులకు దూరం కానున్నాడు. అతని స్థానంలో నవదీప్ నవదీప్ లేదా మహ్మద్ సిరాజ్ ను తీసుకునే అవకాశం ఉంది. కాగా టెస్ట్ పరాజయంపై కెప్టెన్ కోహ్లి విచారం వ్యక్తం చేశారు. ఓటమి బాధను మాటల్లో చెప్పలేనన్నారు.