
ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లా దలజోడి అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 4.6 క్వింటాళ్ల గంధపు చెక్కలను క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. టాంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు గంధం చెక్కలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎన్టీఎఫ్ పోలీసులు దాడి చేశారు. స్వాధీనం చేసుకున్న గంధపు చెక్కల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. కోటి వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ఒడిశా అటవీ చట్టం -1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.