
కేరళకు చెందిన జర్నలిస్టుపై పలు కేసులు నమోదు చేసి జైలుకు పంపిన వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. జర్నలిస్టు సిద్ధిఖీ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై స్పందన తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ వార్తను కవర్ చేసేందుకు బయలుదేరిన కేరళ జర్నలిస్టు సిద్ధిఖీను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఉగ్ర వ్యతిరేక చట్టం కింద కేసులు నమోద చేసి మథుర జైలుకు పంపించారు. సిద్ధిఖీ అరెస్టును ఖండించిన కేరళ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సిద్ధిఖీ తరుపున వాదించారు. ఆయన సమాధానం విన్న సీజేఐ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నటు్ల పేర్కొంది.