ఏడాది కిందట దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి నుంచి యావద్ దేశం క్రమంగా కోలుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఫిక్కీ 93వ వార్సిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కరోనా సంక్షోభం గురించి తలుచుకుంటే భయమేస్తోంది. అయినా ఆ వైరస్ ప్రారంభ సమయంలో అంతుచిక్కని శత్రువన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో అన్ని రంగాల్లో అనిశ్చితి నెలకొందని, సగటు మానవునిపై ఈ ప్రభావం పడిందన్నారు. ఈ వైరస్ నుంచి ఎప్పుడు కోలుకుంటామో తెలియని ఆందోళన సమయంలో ప్రక్రుతే సహకరించిందన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ ఉత్పత్తి విజయవంతం కావడం.. మరోవైపు ఆర్థికంగా పుంజుకోవడం ప్రోత్సాహకరంగా మారుతున్నాయన్నారు. సంక్షోభ కాలంలో నేర్చుకున్న అనేక పాఠాలు భవిష్యత్తు మార్గాల్ని మరింత బలోపేతం చేశాయన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Recovering from corona prime minister modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com