
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన ఉండనుంది. దుండిగల్ ఎయిర్‌పోర్స్ అకాడమీలో ట్రైనీలతో ఆయన ముఖాముఖి అయ్యారు. అలాగే శనివారం ఉదయం ట్రైనీ పైలట్ల పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొంటారు. మధ్యాహ్నం CASలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అగ్ని మిసైల్ పరీక్షను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు.