
రైతుల ఆదాయంపై కేంద్రాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. దేశంలోని రైతుల సగటు ఆదాయం బీహార్ రైతులు సంపాదన స్థాయికి ఎన్డీయే ప్రభుత్వం దిగజార్చాలనుకుంటోందంటూ ఓ ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. 2013లో ప్రభుత్వ గణాంకాలను రాహుల్ ఉటంకిస్తూ, దేశంలోని రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల ఆదాయంతో సమానంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. అయితే, మోదీ ప్రభుత్వం మాత్రం దేశంలోని రైతులందరి ఆదాయాన్ని బీహార్ రైతుల ఆదాయం కంటే తక్కువగా ఉండేలా చేయాలని కోరుకుంటోందని తప్పపుట్టారు. గణాంకాల ప్రకారం పంజాబ్ రైతుల ఆదాయంలో మొదటి స్థానంలో ఉండగా, బీహార్ అట్టడుగున ఉంది.