Pakistan Vs India: పాకిస్తాన్.. అంటేనే సగటు భారతీయుడి నర నరాన ద్వేషం రగిలిపోతుంది.. భారత్‌తో అనేకసార్లు పాకిస్తాన్ యుద్ధం చేసింది. కానీ, ప్రతీయుద్ధంలో మనమే విజయం సాధిస్తున్నాం. చావుదెబ్బతింటున్న పాకిస్తాన్.. తర్వాత కాళ్ల బేరానికి వస్తుంది. తెల్ల జెండా ఎగువేస్తుంది. తర్వాత తన దొంగబుద్ధిని బయట పెతుడుతంది. అయితే పాకిస్తాన్ చేసే ప్రచారం యుద్ధంలో మాత్రం భారత్ విజయం సాధించడం లేదు. భారత వ్యతిరేక ప్రచారంలో పాకిస్తాన్ విజయవంతం అవుతోంది. తప్పుడు ప్రచారాలతో భారత్‌పై ప్రపంచ వ్యాప్తంగా ద్వేషభావం పెంచుతోంది. తప్పుదోవ పట్టించే పోస్టులు, ఫేక్ వీడియోలు, తప్పు వార్తల ద్వారా భారత సమాజంలో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ విభాగాలు క్రమబద్ధంగా ప్రచార దాడి చేస్తున్నాయి. ఇందులో సోషల్‌మీడియా వేదికలు ప్రధాన ఆయుధాలుగా మారాయి.
ఫేక్ ఖాతాలకు వెనుక పాకిస్తాన్..
2019 తరువాత పాకిస్తాన్ తమ ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. భారతీయుల పేర్లతో ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి భారత వ్యతిరేక పోస్టులు పెడుతోంది. ముస్లింలపై అన్యాయం జరుగుతోందనే అబద్ధపు ప్రచారంతో దేశీయ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం కొనసాగుతోంది. ఇక ఇటీవలి కాలంలో పాకిస్తాన్ రక్షణ సమాచార సంస్థలు కొన్ని విదేశీ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లను నియమించి భారతపై ప్రణాళికాబద్ధమైన వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నాయి. వీరిని పర్యాటక ప్రచారకులుగా చూపిస్తున్నా, వాస్తవానికి ప్రచార యుద్ధంలో భాగస్వాములుగా వాడుతున్నారు.
పర్యాటక ముసుగులో వ్యతిరేక వార్తలు..
పాకిస్తాన్ టూరిజాన్ని ప్రోత్సహించే పేరుతో అనేక విదేశీ బ్లాగర్లను ఆహ్వానించి, వారిద్వారా భారతపై ప్రతికూల వ్యాఖ్యలను వ్యాప్తి చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన క్యాలమ్ మిల్ వంటి బ్లాగర్లు పాకిస్తాన్లో పనిచేసి, తర్వాత భారతదేశాన్ని చెడ్డగా చూపే కంటెంట్‌ను సృష్టించారు. ఇతర దేశాల బ్లాగర్లను కూడా పాకిస్తాన్ ఐఎస్పీఆర్ మార్గదర్శకత్వంలో ఉపయోగిస్తోంది. అజర్‌బైజాన్‌కు చెందిన అనస్తాసియా లబ్రీనా వంటి సోషల్‌మీడియా వ్యక్తులను తమ టీవీ ప్యానల్స్‌లో చేర్చి భారత్‌లపై దుష్ప్రచారం చేస్తున్నారు.
అంతర్జాతీయ మాధ్యమాల్లో..
పాకిస్తాన్ తన వైఖరిని సమర్థించుకునేలా అంతర్జాతీయ ప్రింట్ మీడియా, డిజిటల్ పత్రికల్లో వ్యాసాలు రాయిస్తోంది. ఒంటరి మహిళా పర్యాటకులకు సురక్షిత దేశంగా పాకిస్తాన్ ప్రచారం చేయడం దాని దుష్ట ఉద్దేశాలను కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రమే. ఈ డ్రైవ్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత మరింత వేగం అందుకుంది.
పాకిస్తాన్ అనలిస్టులను భారతీయ టీవీ చానెళ్లకు ఆహ్వానించకూడదనే నిషేధం దేశ భద్రత రక్షణలో భాగమైంది. కానీ ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్న ఈ సమాచారం యుద్ధాన్ని నిలువరించటం నిజమైన సవాలుగా ఉంది. ఇది సంప్రదాయ ఉగ్రవాదానికి సమానమైన డిజిటల్ ఇన్సర్జెన్సీగా మారుతోంది. దేశ ప్రజలలో చైతన్యం పెంపొందిస్తే, తప్పుడు ప్రచారం ఆరాటానికి తెరపడుతుంది. ఈ యుద్ధం బాంబులతో కాదు, సమాచారం సత్యంతో గెలవాల్సిన అవసరం ఉంది.