
కరోనా మహమ్మాని ప్రుముఖులను బలి తీసుకుంటుంది. తాజాగా ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ సతీమణి సుశీలాదేవి కరోనాతో మృతి చెందారు. కరోనా కారణంగా గత కొంత కాలంగా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. సోమవారం పరిస్థతి విషమించి కన్నుమూశారు. దీంతో గవర్నర్ ఇంట్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఒడిశాలో కరోనా విజ్రుంభించడంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇప్పటికీ లాక్ డౌన్ విధించారు. అయినా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. శీతాకాలం కారణంగా కరోనా తీవ్రత పెరుగుతోందని నిపుణులు తెలుపుతున్నారు.