
బీహార్ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. ఇవే నా చివరి ఎన్నికలంటూ అందరినా ఆశ్చర్యానికి గురి చేశారు. బీహార్‌లో ఈరోజుతో ప్రచారం ముగుస్తుండగా పూర్నియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ‘ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు అని తెలుసుకోండి’ అని ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్, నాలుగోసారి అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముదుకెళ్తున్నారు. బీహార్‌లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. నవంబర్ 7న చివరి విడత ఓటింగ్ జరగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి.