
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తదితర ఎన్డీయే పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సుశీల్ మోదీని ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 125 స్థానాలు లభించాయి. ఇందులో బీజేపీకి 74, జేడీయూకు 43, బీహెచ్ పీ 4, హెచ్ఏఎం 4 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కుమార్ నే సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో సోమవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.