
వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధులు సుప్రీం కోర్టుకు తెలిపారు. వాహనాల వల్ల జరిగే వాయు కాలుష్యం, పంట వ్యర్థాల కాల్చివేతలతో వ్యవహరించవలసిన విధానాన్ని ఈ చట్టంలో పొందుపరుచనున్నట్లు తెలిపారు. కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని, కాలుష్య నివారణకు అరికడుతామని తెలిపింది.