
మద్యం సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూడు మద్యం బాటిళ్లకు అనుమతి ఉండగా.. ఇప్పడు వాటిని కూడా తీసుకురావద్దని సూచింది. ఇక ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేవారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం రేట్లు అధికంగా ఉండడంతో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకున్నారు. దీంతో లిక్కర్ ద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది.