Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శత్రు దుర్బేద్యంగా ఉండే వాహనాన్ని ఆయన కోసం కేటాయించింది. మెర్సిడీస్ -మైబహ్ ఎస్ -650 గార్డ్ కారును కొనుగోలు చేసింది. దీనిలో అన్ని అడ్వాన్స్ లే ఉన్నాయి. ప్రధాని భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు కూడా మన ప్రధానులకు ప్రమాదం పొంచి ఉండటంతో ప్రస్తుతం ఉన్న వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఆయన భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

తీవ్రవాదుల ముప్పు పొంచి ఉన్న ప్రమాదం దృష్ట్యా ప్రధాని కారుకు అనేక సదుపాయాలు ఉన్నాయి. దీని ఖరీదు రూ. 12 కోట్ల పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ దాడుల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. అందుకే ప్రధాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అపాయాలు ఉండవు. ఆయన భద్రతకు భద్రం కల్పించడమే లక్ష్యంగా రక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
Also Read: PM Modi: మోడీ ప్రకటించిన కానుక.. పిల్లలకు ఇక‘టీకా’ పండుగ..
ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహేంద్రా స్కార్ఫియో వినియోగించేవారు. ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్, రేంజిరోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ లను వినియోగించినా భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఎస్ 650 కారును వాడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్లను కూడా మార్చాల్సి వస్తోంది. అందుకే భద్రతాధికారుల సూచన మేరకు ప్రధాని తన కారును మార్చారు.
ప్రస్తుతం వినియోగించే కారు ఏకే 47 తూటాలను సైతం తట్టుకుంటుంది. అత్యంత శక్తివంతమైన పేలుళ్ల ధాటికి కూడా తట్టుకుంటుంది. అంతే కాదు కారు కింద పేలుడు సంభవించినా తట్టుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు. విషవాయువుల ప్రభావం జరిగినా అవి లోపలకు రాకుండా నిరోధించే యంత్రాంగా ఇందులో ఇమిడి ఉంది. వేగాన్ని కూడా నియంత్రణలోనే ఉంచుతారు. ప్రత్యేకతలు ఉన్న వాహనం కావడంతో ప్రధాని కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.
Also Read: PM Modi: జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం.. ఎందుకిలా ముగించారు?