Modi Vs Trump: డొనాల్ట్ ట్రంప్ 2.0 పాలనలో ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ట్రంప్ మొదలు పెట్టిన ట్రేడ్, టారిఫ్ వార్.. ఇప్పుడు చాలా దేశాలు అమెరికాకు దూరమయ్యేలా చేశాయి. అమెరికా వ్యతిరేక దేశాలన్నీ ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. అమెరికాను నిలువునా ముంచే ప్లాన్ చేస్తున్నాయి అదే డీ–డాలరైజేషన్. ప్రపంచ దేశాల మధ్య ఇదే చర్చనీయాంశంగా మారింది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బంగారం, ఇతర కరెన్సీలపై దృష్టి సారిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భారత్ ఫారెక్స్ రిజర్వ్‌లలో డాలర్ ఆధిపత్యం ఉన్నప్పటికీ, బంగారం నిల్వలను పెంచే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది.
భారత్ ఫారెక్స్ రిజర్వ్‌లు ఇలా..
ప్రస్తుతం భారత్ వద్ద 704 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వ్‌లు ఉన్నాయి. ఇందులో 616 బిలియన్ డాలర్లు యూఎస్ డాలర్ రూపంలో, 65 బిలియన్ డాలర్లు బంగారం రూపంలో, 18 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ నగదు రూపంలో ఉన్నాయి. ఈ రిజర్వ్‌లు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తాయి. అయితే, డాలర్ ఆధారిత రిజర్వ్‌లు ఎక్కువగా ఉండడం వల్ల అమెరికా ఆర్థిక విధానాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు భారత్‌పై ప్రభావం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత ట్రేడ్ వార్, టారిఫ్ వార్ నేపథ్యంలో డీ–డాలరైజేషన్ ఒక కీలక వ్యూహంగా మారింది.
డీ–డాలరైజేషన్ ఎందుకు?
ప్రపంచ దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. డాలర్ స్థిరత్వం, అంతర్జాతీయ వాణిజ్యంలో దాని ఆధిపత్యం కారణంగా ఇప్పటివరకు దేశాలు డాలర్ రిజర్వ్‌లను ఎక్కువగా నిల్వ చేశాయి. అయితే, అమెరికా ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, డాలర్ సప్లయ్ నియంత్రణ వంటివి ఇతర దేశాల ఆర్థిక స్వాతంత్య్రంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, డాలర్ సప్లయ్ పెంచడం వల్ల దాని విలువ తగ్గి, రూపాయి విలువ సాపేక్షంగా పెరుగుతుంది. ఇది దిగుమతులను చౌక చేస్తుంది. ఎగుమతులు భారంగా మారొచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు భారత్ బంగారం నిల్వలను పెంచే దిశగా చూస్తోంది.
బంగారం నిల్వల పెంపు వ్యూహం..
బంగారం ఒక స్థిరమైన ఆస్తిగా పరిగణించబడుతుంది. దాని విలువ కరెన్సీ హెచ్చుతగ్గులపై ఆధారపడదు. భారత్ తన ఫారెక్స్ రిజర్వ్‌లలో బంగారం వాటాను ప్రస్తుత 65 బిలియన్ డాలర్ల నుంచి మరింత పెంచాలని యోచిస్తోంది. ఇది డాలర్ ఆధారిత రిజర్వ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాక, అమెరికా ఆర్థిక విధానాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాక, బంగారం నిల్వలు ఆర్థిక సంక్షోభ సమయంలో దేశానికి భద్రతను అందిస్తాయి. దసరా తర్వాత భారత్ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
డాలర్ విలువ తగ్గితే భారత్‌కు లాభం..
ప్రస్తుతం ఒక డాలర్ విలువ 87 రూపాయలుగా ఉంది. డీ–డాలరైజేషన్ ప్రక్రియలో డాలర్ సప్లయ్ పెరిగి, దాని విలువ 70–75 రూపాయలకు తగ్గితే, భారత్ దిగుమతి ఖర్చులు తగ్గుతాయి. ఇది చమురు, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతి ఆధారిత ఉత్పత్తుల ధరలను తగ్గిస్తుంది. అయితే, ఇది భారత్ ఎగుమతులను ఖరీదైనవిగా మార్చవచ్చు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఫారెక్స్ రిజర్వ్‌లలో వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్) వైపు అడుగులు వేస్తోంది.
దసరా తర్వాత కీలక నిర్ణయం..
దసరా పండుగ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు షాక్ ఇవ్వబోతున్నారు. ఇన్ని రోజులు టారిఫ్‌లపై మౌన వ్యూహం అనుసరిస్తున్న భారత్.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా అమెరికాకు భారీ షాక్ ఇవ్వబోతోంది. దసర తర్వాత డీ డాలరైజేషన్‌పై కీలక ప్రకటన చేసే అవకావం ఉంది. అయితే డీ–డాలరైజేషన్ ఒక రాత్రిలో జరిగే ప్రక్రియ కాదు. ఇది దీర్ఘకాలిక వ్యూహం, దీనికి దేశాల మధ్య సమన్వయం, ఆర్థిక స్థిరత్వం అవసరం. భారత్ వంటి దేశాలు బంగారం నిల్వలను పెంచడం, ఇతర కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.