Homeజాతీయం - అంతర్జాతీయంPM Modi : ఆస్ట్రేలియాలో మోడీ.. ఢిల్లీలో ప్రతిపక్ష కూటమి.. ఇంతకీ ఏం జరగబోతోంది?

PM Modi : ఆస్ట్రేలియాలో మోడీ.. ఢిల్లీలో ప్రతిపక్ష కూటమి.. ఇంతకీ ఏం జరగబోతోంది?

PM Modi :  ప్రధానమంత్రి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. మరికొద్ది రోజులు ఆయన అక్కడే ఉంటారు.. పసిఫిక్ రీజియన్ లో రెండు రోజులు పర్యటించిన ఆయన… ఆ సముద్ర తీర ప్రాంత దేశాలకు అనేక వరాలు ప్రకటించారు. భారత్ కు దౌత్యపరంగా ఈ దేశాలు అత్యంత ముఖ్యం కావడంతో మోదీ ఆ దిశగా అడుగులు వేశారు. అంతేకాదు భారత్ ఆ దేశాలతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యాన్ని నెలకొల్పుతోందంటూ ప్రకటించారు.. ఇదంతా జరుగుతుండగానే దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే.. ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే ఆ పార్టీల నేతలు భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటి మీదికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

దేశ రాజధానిలో భేటీ
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు దేశ రాజధానిలో భేటీ కానున్నారు. ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే భవిష్యత్తు రాజకీయాలపై చర్చించనున్నారు.. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈనెల 27న వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. దీనికి హాజరుకానున్న బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విడిగా సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సంబంధించి తమ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించనున్నారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో గత నెలలో చర్చలు జరిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర రాష్ట్రాల కిందన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కలుసుకున్నారు.
ఇటీవల ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ను కూడా కలిశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం.. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతుండడంతో ఆయనకు నితీష్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఇక ఇదే కేజ్రీవాల్ మంగళవారం మమతా బెనర్జీతో కేటీ అయ్యారు.. భవిష్యత్తు రాజకీయాల మీద చర్చించారు. మమతా బెనర్జీ గురువారం ఢిల్లీ చేరుకుంటుంది. మూడు రోజుల పాటు ఆమె అక్కడే మకాం వేస్తుంది. వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరుగుతుంది.. అయితే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు ముఖ్యమంత్రిలు ముఖ్య మంత్రులు స్టాలిన్, హేమంత్, సోరెన్, నితీష్, పినరయి విజయన్ వంటి నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతుంది.. ఈ సమావేశం తర్వాత ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కీలక వేదిక ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular