Modi Not Answer Trump Phone Call: మనం స్నేహితులు అనుకున్నవారు మోసం చేస్తే మన మనసుకు బాధగా ఉంటుంది. వారితో మాట్లాడడాని, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడం. ఇక ఫోన్ చేస్తే లిఫ్ట చేయం.. దీంతో మెస్సేజ్‌లు పంపినా రిప్లై ఇవ్వం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు అమెరికా విషయంలో ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మై ఫ్రెండ్ అని చాలాసార్లు చెప్పారు. ట్రంప్ కూడా అలాగే పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు భారత్‌పై ట్రంప్ కక్షసాధింపు చర్యలకు దిగాడు. భారత ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు. రష్యానుంచి ప్రపంచంలోనే ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా, అత్యధిక గ్యాస్ కొంటున్న దేశాలు యూరోపియన్ యూనియన్, ఎక్కువ వ్యాపారం చేస్తున్న దేశం అమెరికా. కానీ, ట్రంప్ భారత్‌ను టార్గెట్ చేసి టారిఫ్‌లు విధించారు. భారత్ ఎదుగుదలను ఓర్వలేకనే టారిఫ్‌ల రూపంలో దెబ్బతీయాలని చూస్తున్నారు. దీంతో ట్రంప్ మోసాన్ని గుర్తించిన మోదీ.. ఆయనతో దోస్తీకి కటీఫ్ చెప్పారు.
Also Read: విశాఖలో పవన్ పెద్ద గేమ్ ప్లాన్!
ట్రంప్ ఫోన్‌కు స్పందించని మోదీ..
జర్మనీకి చెందిన ఎఫ్‌ఏజీ పత్రిక ప్రచురించిన ఒక కథనం ప్రకారం, భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్స్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కథనం భారత్–అమెరికా సంబంధాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో భారత్, అమెరికా రెండూ ఖండించకపోవడం గమనార్హం. ఎఫ్‌ఏజీ పత్రిక ప్రకారం, ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ మోదీ స్పందించలేదు. ఈ విషయం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తింది. భారత్–అమెరికా సంబంధాలు సాధారణంగా స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, ఈ ఆరోపణలు మోదీ వైఖరిలో మార్పును సూచిస్తున్నాయా అనే చర్చకు దారితీస్తున్నాయి. ట్రంప్ యొక్క 50 శాతం సుంకాల విధానం భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలనే ఆలోచనను బలపరిచినప్పటికీ, మోదీ ఈ చర్చలను నిలిపివేసినట్లు పత్రిక వెల్లడించింది. ఇది భారత్ తన స్వప్రయోజనాలను కాపాడుకోవడంలో ధ్రుఢమైన వైఖరిని సూచిస్తుంది.
భారత్ వాణిజ్య వ్యూహం..
భారత్ అమెరికాతో వాణిజ్య చర్చలను నిలిపివేయడం దాని ఆర్థిక స్వావలంబన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంతకాలం అమెరికా చర్చలను ఆపిందని భావించినప్పటికీ, భారత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందని ఎఫ్‌ఏజీ పత్రిక తెలిపింది. ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా, భారత్ జీఎస్టీ తగ్గింపు, ఇతర దేశాలతో వ్యాపార ఒప్పందాలను రూపొందించడం వంటి వ్యూహాలను అమలు చేస్తోంది. 2027 నాటికి సుంకాల భారాన్ని అధిగమించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది, ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి సంకేతం.
దగ్గరవుతున్న చైనా, రష్యా, భారత్..
ఎఫ్‌ఏజీ పత్రిక కథనం ప్రకారం, చైనా, భారత్, రష్యా కలిసి పనిచేస్తే అమెరికాకు ఆర్థిక, రాజకీయ ఇబ్బందులు తప్పవని ట్రంప్ భావిస్తున్నారు. చైనా తన మానిఫ్యాక్చరింగ్ హబ్ సామర్థ్యంతో, భారత్ ఫార్మా, ఐటీ, బయో–కెమికల్ రంగాల్లో అగ్రగామిగా, రష్యా చమురు వనరులతో బలంగా ఉండడం వల్ల ఈ మూడు దేశాల ఐక్యత అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి సవాలుగా మారవచ్చు. ఈ సందర్భంలో, భారత్ స్వతంత్ర వైఖరి ట్రంప్ యొక్క వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని ప్రదర్శిస్తోంది.
స్నేహం నుండి కఠినత వరకు
మోదీ సాధారణంగా స్నేహపూర్వక దౌత్య సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే, ఈ వివాదం ట్రంప్ విషయంలో మోదీ కఠిన వైఖరిని తెలియజేస్తోంది. ట్రంప్ భారత్‌తో చర్చల ద్వారా రాజకీయ ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ, మోదీ ఈ అవకాశాన్ని ఇవ్వడం లేదు. భారత్ స్వప్రయోజనాలను కాపాడుకోవడంలో మోదీ ఈ నిర్ణయం దేశం యొక్క ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రాన్ని బలోపేతం చేస్తోంది.