
వ్యాక్సిన్ త్వరలో వస్తోంది కాబట్టి ఇక నిబంధనలు, ఆంక్షలు అవసరం లేదన్నే భ్రమలకు లోను కావద్దని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ప్రపంచం, శాస్త్రవేత్తలు మనకు చెబుతున్న విషయం ఇందే అని 2021లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిదేనని ప్రధాని స్పష్టం చేశారు. కొత్త ఏడాది కొత్త మంత్రం కరోనా పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవడమేనని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిదని ఆయన చెప్పారు. ప్రజలందరికీ మేడ్ ఇన్ ఇండియా టీకాయే లభిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరూ కరోనా మహమ్మారి పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.