India Pak Sir Creek Border Dispute: పాకిస్తాన్ బుద్ధి కుక్కతోకలాంటిదే. అందుకే భారత్ ఆ దేశంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. తాజాగా దాయాది దేశంలో ఏదో జరుగుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. గుజరాత్ తీరంలో పాకిస్తాన్ ఏదో చేస్తోంది. ఈమేరకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యం భారత్ అలర్ట్ అయింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, భారత సైనికాధికారులు బలమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది కేవలం మాటల యుద్ధం కాకుండా, సైనిక సంసిద్ధత, భౌగోళిక మార్పుల వరకు విస్తరించే అవకాశం ఉంది.
ఆర్మీ చీఫ్ వార్నింగ్..
భారత సైనికాధికారి ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. సరిహద్దు దాటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం వల్ల పాకిస్తాన్ తన ఉనికినే ప్రమాదంలో పడేసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భారత్ రక్షణ విధానంలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. ఎందుకంటే గతంలోని సహనాన్ని మించి, ఇప్పుడు ప్రత్యక్ష చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి. ఇలాంటి హెచ్చరికలు డిప్లమాటిక్ ఒత్తిడిని పెంచుతాయి. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తాయి. భారత్ వైఖరి, ఉగ్రవాదాన్ని సహించకుండా ఉండటం ద్వారా, ప్రాంతీయ శాంతిని కాపాడే ప్రయత్నంగా చూడవచ్చు. ఆపరేషన్ సిందూర్ 2.0: గత పాఠాల నుంచి కొత్త బెదిరింపుగతంలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సహనం పాటించిందని ద్వివేది పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ మరోసారి రెచ్చగొడితే ఒక మరింత బలమైన వెర్షన్‌ను ప్రారంభించి, పాకిస్తాన్‌ను భూమి నుంచి తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఇది కేవలం భయపెట్టే మాటలు కాకుండా, సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించే సూచన. విశ్లేషకుల అభిప్రాయంలో, ఇలాంటి ఆపరేషన్లు సర్జికల్ స్ట్రైక్‌ల వంటివి కావచ్చు, ఇవి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగిస్తాయి. ఇది భారత్ రక్షణ వ్యూహంలో ఆక్రమణాత్మక మార్పును సూచిస్తుంది, ఇది పాకిస్తాన్‌ను తన విధానాలను మార్చుకోవాలని వార్నింగ్..
సైనికులకు సూచన..
ఎలాంటి పరిస్థితికైనా సన్నద్ధంద్వివేది తన సైనికులకు ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికుల చురుకైన కార్యకలాపాలు, నిఘా సమాచారం ఆధారంగా గుర్తించబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భారత్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా, ఏదైనా దాడికి సమర్థవంతంగా స్పందించగలదు. ఇది ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంలో భారత్ పాత్రను బలపరుస్తుంది. అంతర్జాతీయ మద్దతును కూడా ఆకర్షిస్తుంది. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి, పొరుగు దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. వక్రబుద్ధి చూపితే భౌగోళిక పరిస్థితులు మారిపోతాయని ఆయన అన్నారు. ఇది సైనిక చర్యల ద్వారా సరిహద్దు మార్పులు లేదా పాకిస్తాన్ భూభాగంపై ప్రభావం చూపే సూచన. రాజకీయంగా, ఇది భారత్ వైఖరిని ప్రదర్శిస్తుంది.
ఈ హెచ్చరికలు భారత్ రక్షణ విధానంలో ఒక బలమైన మార్పును సూచిస్తాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలేస్తే మాత్రమే శాంతి సాధ్యమవుతుంది. ఇది అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక సందేశం. ఉగ్రవాదాన్ని సహించకూడదని. భవిష్యత్తులో సైనిక చర్యలు ఏవైనా జరిగే అవకాశం ఉంది, అయితే భారత్ సంసిద్ధత శాంతిని కాపాడటంలో కీలకం.