
ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా అవతరించనుందని, రానున్న రెండు దశాబ్దాల్లో ఇది జరుగుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలుంటాయన్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో ‘ఆన్‌లైన్ ముఖాముఖి’లో ముఖేష్ మాట్లాడారు. ‘ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020’ పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది. తొలి ఎడిషన్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ వర్చువల్ భేటీలో మార్క్, అంబానీ మాట్లాడారు.