
సొంతగడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా భారీ షాక్ తగిలింది. జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండో టెస్టుకు దూరం కానున్నారు. తొడ కండరాల గాయంతో ఇప్పటికే ఆఖరి వన్డే, టీ20 సిరీస్, తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. వార్నర్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఇక పేసర్ సీన్ అబాట్ సైతం ఈ టెస్టులో అడలేడని తెలిపింది. ఇక సిడ్నీలో కరోనా వ్యాప్తి తీవ్రత ఉన్నందున కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు.