
రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, ఆయుర్వేద ఉత్పత్తులకు భారతదేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. న్యూఢిల్లీ లోని జామ్ నగర్లో ఆయుర్వేద ఇనిస్ట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్(ఐటీఆర్ఏ), జైపూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎన్ఐఏ)లను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుర్వేదం వైద్య ప్రపంచంలో ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. అల్లోపతి, ఆయుర్వేద పద్ధతులు ప్రాచీన భారతదేశానికి చెందినవన్నారు. దేశంలో ఆయుర్వేదం అగ్రస్థానంలో నిలవబోతుందని చెప్పారు. కరోనా కారణంగా ప్రతి ఇంట్లో పసుపు పాలు, అశ్వగంధ హెర్బ్,కాధా వంటి రోగనిరోధక శక్తి బూస్టర్లు వినియోగిస్తున్నారన్నారు.