
గుండెపోటుతో కోల్ కతా ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదమేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు. ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, అయితే యాంజియో ప్లాస్టీ ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారన్నారు. తాను గంగూలీ కుటుంబ సభ్యులతో మాట్లాడానని అన్నారు. కాగా గంగూలీకి గుండెపోటు విషయం తెలియగానే త్వరగా కోలుకోవాలని టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రహనే ట్వీట్ చేశారు. అలాగే ఐసీసీ కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని తెలిపింది.