
దేశంలోని ప్రతి ఒక్కరిని ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా టీకా అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పలుచోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆందోళనకు తెరదించుతూ ప్రధాని గురువారం దేశంలో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుంటా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందని, ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు.