
గత కొన్ని రోజులుగా ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నిన్న బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా మరో దారుణం జరిగింది. కబీర్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. డియోరియా జిల్లాకు చెందిన అమ్రుద్దీన్, అర్మాన్, అప్ఝన్, రియాజ్, మహమ్మద్ లు లక్నో నుంచి సొంత జిల్లాకు వస్తున్నారు. ఈ క్రమంలో కబీర్ నగర్ జిల్లాలోని సరియా గ్రామంలో వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్నఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.