
బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మల్కాపూర్ నుంచి సూరత్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు నందూర్‌బాగ్ జిల్లాలోని కొండైబారి ఘాట్ వద్ద బుధవారం ఉదయం 30 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 34 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను విసర్వాడి ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో డ్రైవర్, క్లీనర్ కూడా ఉన్నారు.