
కల్తీ మద్యానికి కేరళలో ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని పాలక్కాడ్ నగరంలోని వలయార్ గిరిజన కాలనీలో కల్తీ మద్యం తాగిన రామన్, అయ్యప్పన్, అరెన్, శివన్, మూర్తిలు అస్వస్థతకు గురై మృతి చెందారు. అలాగే ముగ్గురు మహిళలతో పాటు మరో 9 మంది ఆసుపత్రిలో చేరారు. గిరిజన కాలనీలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వీరందరూ కల్తీ కల్లు తాగినట్లు ఓ వ్యక్తి పోలీసులకు వివరించారు. కాగా ఖాళీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.