
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే షా పెవిలియన్ చేరాడు. శుభ్‌మన్ గిల్‌కు బదులు ఓపెనర్‌గా షా చోటు దక్కించుకున్నప్పటికీ ప్రభావం చూపడంలో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పృథ్వీషాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని జట్టులోకి ఎలా తీసుకున్నారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.