
కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేటితో 19వ రోజుకు చేరుకుంది. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. దీంతో రైతులు ఆందోళనను మరింత ఉద్రుతం చేస్తున్నారు. రోజుకో కార్యక్రమం ద్వారా నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాల్లో రైతులు నిరహార దీక్షకు దిగారు. వీరి నిరాహార దీక్షకు ఢిల్లీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనతో పాటు తమ పార్టీ కార్యకర్తలు రైతులకు మద్దతుగా ఉపవాస దీక్షలు చేయాలని కోరారు. వ్యవసాయ చట్టంపై రైతులు చేస్తున్న ఆందోళనపై తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టం ద్వారా రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.