
నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ మ్యాచ్ ఫలితంపై నా మనసులో మెదులుతున్న భావాలను వెల్లడించడానికి మాటలు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. 60 పరుగుల ఆధిక్యంలో ఉండి కూడా రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిపోయామని వెల్లడించాడు. రెండు రోజులు ఎంతో శ్రమించి తిరుగులేని పొజిషన్ లో ఉన్న తాము, కేవలం ఒక గంటలో ఇక గెలవలేని పరిస్థితికి జారిపోవడం బాధాకరమని పేర్కొన్నాడు.