
దేశంలో కరోనా మరణాలు నిన్నటితో పోలిస్తే పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 564 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,50,598 గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,32,726 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,39,747 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 84,78,124 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి తో పోలిస్తే మరణాలు కూడా పెరిగాయి.కాగా ఇప్పటి వరకు 13,06, 57,808 కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ప్రస్తతు శీతాకాలంతో వాతావారణంలో మార్పులు చోటు చేసుకొని కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.