
ఇటీవల కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రజాప్రతినిధులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పడ్నవీస్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నానని వైద్యుల సూచన మేరకు మెడిసిన్ వాడుతున్నానని పడ్నవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనతో కాంటాక్టు అయినవారు అవసరమైతే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా పడ్నవీస్ బీహార్ ఎన్నికల ప్రచారానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఎన్నో సేవలు చేశానని, అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.