
స్వల్ప లక్షణాలు ఉండడంతో రాజస్థాన్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కెక్రీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి రఘుశర్మ సోమవారం టెస్ట్ చేయించుకోవడంతో వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్ వెళ్లారు. నిన్న ఆయన నియోజకవర్గంలో విస్త్రుతంగా పర్యటించారు. క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో మాస్క్ ధరించని వారికి రూ. 200 నుంచి రూ.500కి పెంచింది.