
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన మంగళవారం నాటికి 41 రోజుకు చేరింది. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే ఈనెల 8న మరోసారి చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు. నిన్న జరిగిన చర్చల్లో రైతులు లేవనెత్తిన డిమాండ్లలో రెండిండికి ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఏడోవిడత చర్చల్లో మంత్రులు, రైతులు కలిసి భోజనం చేశారు. ఇదిలా ఉండగా రైతులను వేర్పాటు వాదులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని 35 మంది పంజాబ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాశారు. ఈ లేఖను పిటిషన్ స్వీకరించి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా మార్చారు. దీనిపై త్వరలో విచారణ సాగనుంది.