
కొత్తగా తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనలు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతు ఆందోళనపై ప్రసంగించిన సీఎం కేజ్రీ.. ఓ దశలో కొత్త రైతు చట్టాల ప్రతులను చింపేశారు. కరోనా మహమ్మారి వేళ పార్లమెంట్ నిర్వహించి.. త్వరితగతిన రైతు చట్టాలను తీసుకురావడం ఎంత వరకు అవసరమని, రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించకుండా తొలిసారి మూడు రైతు చట్టాలను తీసుకువచ్చారని, అందుకే ఈ మూడు రైతు చట్టాల ప్రతులను అసెంబ్లీలోనే చింపివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర పాలకులు బ్రిటీషర్ల కన్నా హీనం కారాదు అని ఆయన అభ్యర్థించారు.