
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా, సెకండ్ వేవ్, కొత్త వైరస్ భయం పట్టుకుంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా ఈనెల 28,29 తేదీల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ను చేపట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. దేశంలో నాలుగు రాష్ట్రాలను ఇందుకోసం ఎంపిక చేసింది. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇండియాలో గుజరాత్, పంజాబ్, ఈస్ట్ ఇండియాలో అసోం రాష్ట్రాలను ఈ కరోనా డ్రైరన్ కోసం ఎంపిక చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లోని 8 జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన 8 జిల్లాల్లో డ్రై రన్ చేపడతారు.