రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలిలోని కేజీఎఫ్ 2 షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో 8 మొక్కలు నాటినట్టు తెలిపారు సంజయ్ దత్. అనంతరం తన అభిమానులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. అభిమానులు ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి..గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని కొనసాగించాలని సంజయ్ దత్ విజ్ఞప్తి చేశారు.