
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస్తామంటూ కేంద్ర సర్కారు పంపిన ప్రతిపాదనలను తిరస్కరించిన అనంతరం.. రైతులు సంఘాల నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేసే విషయమై చర్చించారు. ఆ మేరకు ఆందోళనను ఉధృతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.